ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయడం పట్ల తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగులకు అనుకూలమైన పథకాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేస్తున్నందుకు తెలంగాణ ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపింది.హెల్త్ కార్డ్ సౌకర్యాలను అందించే విషయంలో ఆయన నాయకత్వం మరియు దయార్ధమైన నిర్ణయం ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు మరియు ఆర్ధిక భద్రత కల్పిస్తుందని సంఘం గౌరవ అధ్యక్షుడు ఎ. పద్మచారి, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రవీంద్ర కుమార్, జనరల్ సెక్రటరీ పి. కృష్ణ రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ వి. సురేంద్ర అధ్యక్షుడు గ్రేటర్ హైదరాబాద్ ఎస్.నర్సింగ్ రావు, , సలహాదారు పి. పవన్ కుమార్,పి. కృష్ణ మూర్తి,పి. పరమేశ్,బి. ప్రవీణ్ కుమార్ సంయుక్త్య ప్రకటనలో పేర్కొన్నారు.ఈ చర్య రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులలో విశ్వాసాన్ని సృష్టించింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం తన ఉద్యోగుల సంక్షేమం పట్ల చూపిస్తున్న అంకితభావానికి నిదర్శనమన్నారు.సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ కృషి మరియు ప్రభుత్వం కట్టుబడిన సానుకూల సిఫార్సులను గమనిస్తూ, హెల్త్ కార్డ్ పథకం విజయవంతంగా అమలుకు తోడ్పడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వం త్వరగా PRC (పే రివిజన్ కమిషన్) నివేదికను సమీకరించి, సవరించిన జీతాల అమలును వీలైనంత త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేవ్సారు. ఈ నివేదికను ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని,అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ ఉన్న అన్ని Dearness Allowances (Das)ను వెంటనే విడుదల చేయమని కూడా మనవి, ఇది ఉద్యోగులు పెరుగుతున్న జీవన ఖర్చులను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.