ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలి

Facebook
X
LinkedIn

సదాశివపేట మున్సిపల్ చైర్మన్వైస్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం లో  నిర్మలా జగ్గారెడ్డి

సదాశివపేట  :

సదాశివపేట మున్సిపల్ చైర్మన్  గా  మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు ల  బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ లను ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  ప్రజా సమస్యల పరిష్కారం లో మున్సిపల్ పాలక వర్గం ఎల్లప్పుడూ ముందుడాలని సూచించారు. అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగిస్తూ పట్టణాభివృద్ధి కి పాటుపడాలన్నరు. ఈ కార్యక్రమం లో సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ, చిరు, అరుణ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.