గవర్నర్ చేతుల మీదుగా‘విశిష్ట ప్రతిభా రత్న’ అవార్డుతో మెరిసిన సెరినిటీ విద్యార్థులు

Facebook
X
LinkedIn

కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి

కీసర:

హిందీ సేవా సదన్ మహావిద్యాలయ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించిన నాగారం సెరినిటీ పాఠశాల విద్యార్థులు హరిక, ఆరాధ్య గవర్నర్ చేతుల మీదుగా ‘విశిష్ట ప్రతిభా రత్న’ పురస్కారం అందుకోవడం పాఠశాలకు గర్వకారణమని కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం సాధించి రూ.2,500 నగదు పురస్కారం, బంగారు పతకం, ప్రశంసా పత్రం అందుకోవడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నామని అన్నారు.

ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందిస్తూ, విద్యార్థులను పాఠశాల తరఫున బుధవారం విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి పాఠశాల పేరును రాష్ట్ర స్థాయిలో మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.