బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌

Facebook
X
LinkedIn

40 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మంచిర్యాల  :

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అయింది. నిన్న రాత్రి కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అస్వస్థతకు లోనైన 40 మంది విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు.కాగా ఫుడ్‌ పాయిజన్ ఘటనకు సంబంధించి షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి 7:30 గంటలకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ఫోన్‌ చేసిన తెలుపగా.. హాస్టల్‌ వార్డెన్‌ రాత్రి 10 గంటలకు హాస్టల్‌ వద్దకు వెళ్లడం గమనార్హం. అన్నంలో పురుగులు వచ్చాయని తెలిపినా పడేయకుండా అలాగే తినాలని హాస్టల్‌ వార్డెన్‌ విద్యార్థినులకు చెప్పినట్టు సమాచారం. ఫుడ్‌ పాయిజన్‌ అయిన విషయం బయటకు వస్తే పరువు పోతుందని హాస్టల్‌ వార్డెన్‌ విద్యార్థినులకు ఆర్‌ఎంపీ డాక్టర్‌తో చికిత్స చేయించాడు.108కి కాల్‌ చేయమని విద్యార్థినులు ఎంత వేడుకున్నా హాస్టల్‌ సిబ్బంది వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అక్కడే చూస్తూ కూర్చున్నారు. హాస్టల్‌ వార్డెన్‌ వచ్చే వరకు మూడు గంటలపాటు నరకం అనుభవించామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.