అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా పెద్ద చెరువు పక్కన ప్రభుత్వ ఖాళీ స్థలం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ఉమ్మడి చిల్కానగర్ డివిజన్ పరిధిలో లక్ష్మీ స్టార్చ్ కంపెనీ సమీపంలో ఉన్న పెద్ద చెరువు పక్కన సుమారు రెండున్నర ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈనేపద్యం లో బీజేపీ ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ దేవసాని బాలచందర్ ఆధ్వర్యంలో  ప్రతినిదుల బృందం ఉమ్మడి చిల్కానగర్ డివిజన్ పరిధిలో లక్ష్మీ స్టార్చ్ కంపెనీ సమీపంలో ఉన్న పెద్ద చెరువు పక్కన సుమారు రెండున్నర ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఈ స్థలం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నదని స్తలాన్ని వారు పరిశీలించారు..ఈ సంన్దర్బంగా దేవసాని బాలచందర్  మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాలంలో గౌరవ మాజీ మంత్రివర్యులు  టి. దేవేందర్ గౌడ్   ఈ చెరువును ప్రజలకు ఉపయోగపడే విధంగా సుందరీకరణ చేశారు. అనంతరం మిగిలిన స్థలంలో కొంతమంది ఆక్రమణదారులు అక్రమంగా గుడిసెలు నిర్మించేందుకు ప్రయత్నించిన సందర్భంలో   మాజీ శాసనసభ్యులు   ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్  ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉద్యమం చేపట్టి ప్రభుత్వ స్థలాన్ని రక్షించిన విషయం గుర్తుచేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థలం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లకుండా, యువత ప్రక్కదారి పడకుండా నిరోధించడానికి, అలాగే సీనియర్ సిటిజన్లకు విశ్రాంతి, ప్రజలకు వినోదం, క్రీడల అభివృద్ధి కోసం ఈ స్థలాన్ని పార్క్ మరియు క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేయాలని గౌరవ పార్లమెంట్ సభ్యులు   ఈటెల రాజేందర్  మరియు స్థానిక ఉప్పల్ శాసనసభ్యులు   బండారి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు..ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా మరియు జీహెచ్ఎంసీ విభాగాల సమన్వయంతో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా వినియోగానికి మార్చి అధిక జనసాంద్రత కలిగిన చిల్కానగర్ ప్రాంతానికి ఉద్యానవనం మరియు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.అధికారులు తగిన చర్యలు చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, గ్రామ పెద్దలతో పాటు ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్  దేవసాని బాలచందర్ , బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతి సత్యనారాయణ, అడ్వకేట్ ఆలే నరేందర్, శామీర్పేట చంద్రయ్య , విద్యాసాగర్ , ఓర్సు శేఖర్, భవానంద్,, ముత్యాల కృష్ణారెడ్డి , సదాశివరెడ్డి, రమేష్ , కార్తీక్ , వివేక్ తదితరులు పాల్గొన్నారు.