బొగ్గుగనిలో భారీ పేలుడు.. 10 మంది కార్మికులు మృతి

Facebook
X
LinkedIn

షిల్లాంగ్ :

మేఘాలయలోని బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలో ఓ గ్రామంలోని అక్రమ బొగ్గు గనిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత బొగ్గుగనిలో చాలా మంది కార్మికులు చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ బొగ్గుగనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు ఘటనపై పోలీసు సూపరింటెండెంట్ వికాశ్ కుమార్ మాట్లాడుతూ.. థాంగ్స్కు ప్రాంతంలో ఉదయం ఈ సంఘటన జరిగిందని మా బృందం ధృవీకరించింది. గనిలో ఎంతమంది ఉన్నారో ఇంకా నిర్ధారించబడలేదు” అని చెప్పారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడని.. మెరుగైన చికిత్స కోసం అతన్ని షిల్లాంగ్‌కు తరలించినట్లు వికాశ్ కుమార్ చెప్పారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.