సంగారెడ్డి మున్సిపాలిటీ లో రూ 31.70 కోట్ల తో అభివృద్ధి పనులు

Facebook
X
LinkedIn

13 వార్డు ల్లో   స్థానిక నాయకులతో కలిసి అభివృధ్ది పనులకు శంఖుస్థాపన చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి  :

సంగారెడ్డి మున్సిపాలిటీ లో 31.70 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపనలు చేశారు.  మున్సిపాలిటీ పరిధి లోని 13 వార్డుల్లో  స్థానిక నాయకులతో కలిసి ఆమె కొబ్బరి కాయ కొట్టి లాంఛనంగా  శంకుస్థాపన చేశారు. రూ.31.70  కోట్ల HMDA, UIDF నిధుల తో సంగారెడ్డి మున్సిపాలిటీ లో పలు వార్డుల్లో సిసి రోడ్లు , డ్రైన్ లతో పాటు   3 కోట్ల రూపాయల తో రాజీవ్ పార్క్ సుందరీకరణ,  2 కోట్లతో రాజంపేట నుండి ఈద్గా వరకు ఫిల్టర్ బెడ్ రోడ్ నిర్మాణానికి ఈ రోజు శంఖుస్థాపన లు చేశారు. ఈ కార్యక్రమం లో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోంగుల రవి, అశోక్ రెడ్డి,   కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్,  మహేష్, శ్రీకాంత్ గౌడ్, ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు.