మల్లాపూర్ డివిజన్ నివాసి హరి కుటుంబానికి అండగా నెమలి అనిల్ కుమార్

Facebook
X
LinkedIn

10000/- రూపాయల ఆర్ధిక సహాయం అందచేత

మల్లాపూర్ :

గత కొన్నిరోజుల నుండి కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడ్తున్న మల్లాపూర్ డివిజన్ లోని న్యూ భవాని నగర్ కాలనీ వాసి హరి కుటుంబానికి గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ అండగా నిలిచారు,మల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల సమాచారంతో ఈరోజు హరి కుటుంబాన్ని వారి నివాసంలో నెమలి అనిల్ కుమార్ పరామర్శించి 10000/- రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి కుటుంబానికి ధైర్యం చెప్పారు,అలాగే ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుండి తగిన పథకాలు ఇప్పించే విధంగా కృషి చేస్తానని ఈ సందర్బంగా హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ అక్బర్,మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి V.శ్రీనివాస్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోయలకొండ రాజేష్,NSUI అధ్యక్షులు బాతరాజు రాహుల్,యాసీన్ తదితరులు పాల్గొన్నారు.