క్షేమంగా ఇంటికి చేరండి..

Facebook
X
LinkedIn

కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకండి

చిలుకల గూడా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగన్ రెడ్డి

సికింద్రాబాద్ :

క్షేమంగా ఇంటికి చేరండి.. కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకండి అని చిలుకల గూడా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగన్ రెడ్డి వాహన దారులకు విజ్ఞప్తి చేసారు.నూతన సంవస్సరం పురస్కరించుకొని ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్బంగా పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాదారు. వాన దారులు మద్యం మత్తులో వాహనాలను నడపకూడదని హితవు పలికారు.గత సంవత్సరపు తీపి అనుభవాలను కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తూ నూతన సంవత్సరానికి శుభారంభం పలకాలని వాహనాలను కోరారు. వాన దారులు మద్యం మత్తులో వాహనాలను నడపకూడదని ఒకవేళ మద్యం మోతాదు మించి సేవిస్తే జరిగే ప్రమాదలను ద్రుష్టి లో పెట్టుకొని ఆలోచించి క్యాబులను ఆశ్రయించాలని కోరారు. అంతే కాకుండా ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ ను అధికమించకుండా ఇబ్బంది పడకుండా ఇల్లలకు చేరి తమ తమ కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవాలని అన్నారు. ఈ ఒక్కరోజు పద్యం సేవించడం వల్ల జరిగే అనర్ధాలను ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని తమకు సహకరించాలని ఆయన కోరారు