పోకల రంజన్ కార్టూన్ల హాస్య చిత్రమాలిక సంపుటి ఆవిష్కరణ

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ప్రముఖ కార్పొరేట్ చిత్రకారులు దివంగత జ్ఞాన రంజన్ సృజనాత్మకత చిత్రాలు కార్టూన్ల సంపుటి ‘హాస్య చిత్రమాలిక’గ్రంధావిష్కరణ హైదరాబాద్ సనత్ నగర్ లో ఘనంగా సోమవారం జరిగింది. ప్రముఖ రచయిత డాక్టర్ మాదిరెడ్డి అహోబల రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు ఎం రాఘవరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి హాస్య చిత్రమాలిక పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. బాబు గారిలా నిరాడంబరంగా తన వితాలను చేసుకుంటూ అద్భుతమైన హాస్య ,వ్యంగ్య రేఖాచితాలను ప్రకృతి దృశ్యాలను అందించారని అవి నాటి ప్రముఖ పత్రికలలో ప్రచురితమైనాయని వారి ప్రతిభ అభినందనీయమన్నారు. డాక్టర్ మాదిరెడ్డి అహో బలరావ్ మాట్లాడుతూ రంజన్ గొప్ప రాజకీయ చిత్రాలను గీసి అబ్బురపరిచారని ఆయన కీర్తి శేషులు అయిన ఏడాదికి ఈ పుస్తకం వెలువరించిన వారి కుటుంబ సభ్యులు ధన్యులని అన్నారు. ఈ కార్యక్రమంలో రంజన్ ధర్మపత్ని జయశ్రీ కుమారులు సుమంత్ కుమార్, శ్రీకాంత్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,ఈ సందర్బంగా కవి రఘు శ్రీ వారిని సత్కరించారు.