మెట్రో పిల్లర్‌ను ఢీకొని  ఇద్దరు స్నేహితులు అక్కడిక్కడే మృతి

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ( పిల్లర్ నెం. 1618 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు స్నేహితులు అక్కడిక్కడే మృతి చెందారు. అతివేగంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వీరు నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగర వాసులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మధు, హరీష్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.