వృద్ధుని అంత్యక్రియలకు వెస్సో సహాయం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

నిజాంపేట్ నివాసి అయిన తాళాబత్తుల కన్నయ్యా చారి (71) ఒక ఫౌండ్రీ లో సహాయకుడిగా చిరు జీతానికి పనిచేసేవారు.  వయసు మీద పడి, కొద్ది సంవత్సరాల క్రితం ఆయన తన ఉద్యోగం మానివేసినప్పటికీ,  అవివాహితుడు మరియు స్వర్ణకారుడు అయిన తన ఏకైక కుమారుడు సతీష్ కుమార్(40) కొద్ది సంవత్సరముల క్రితం పక్షవాతానికి గురైన కారణంగా, కుటుంబం గడవడానికి, కన్నయ్య చారి మరల తన పని లో చేరవలసి వచ్చింది! కొద్ది రోజులుగా అస్వస్థులైన కన్నయ్య చారి, ఇటీవల శివైక్యం చెందారు. పెళ్లయిన వారి ఇద్దరు కుమార్తెల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం!  సహాయం లేకుండా తండ్రి అంత్యక్రియలు కష్టంగా భావించిన సతీష్ కుమార్ సహాయం కోరగా వెస్సో ట్రస్ట్రీలు స్పందించి, గౌరవ దాతల సహకారంతో సతీష్ కుమార్ కు పదివేల రూపాయలు అంత్యక్రియలకు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ, తీవ్ర ఆర్థిక సమస్యలతో జీవన పోరాటం చేస్తున్న కుటుంబంలో వృద్ధుని అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం చేసి ఆదుకొన్న గౌరవ దాతలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.