పార్టీ పరమైన రిజర్వేషన్ల వల్ల బీసీలకు నష్టం

Facebook
X
LinkedIn

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘo రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్


హైదరాబాద్ :

బీసీ రిజర్వేషన్లు 42% చట్టబద్ధంగా కల్పించాలి కానీ పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘo రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు బీసీలకు కాంగ్రెస్ అధిష్టానం పై నమ్మకం పోతుంది అని హెచ్చరించారు, కామారెడ్డి డిక్లరేషన్ మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలన్నారు ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు పెంచుతామని చెపుతుంటే రాష్ట్రo లో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాజకీయాలు చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నాం, ఇదేవిదంగా వ్యవహరిస్తే ప్రభుత్వ నికి బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు