దానం నాగేందర్, కడియం శ్రీహరిల శాసనసభ్యత్వాలకు రాజీనామా తప్పదా?

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయకేతనం ఎగుర వేయడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరింత పట్టు బిగించినట్లైంది. జూబ్లీ ఉత్సాహంతో తన బలాన్ని పెంచుకోవాలనుకంటున్నది. ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఇదే అదనుగా తీసుకుని ప్రతిపక్షాలను ఎండగడుతూ, తమ బలాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా భావిస్తున్నది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు, జిహెచ్‌ఎంసి ఎన్నికలకు వెళ్ళడమే కాకుండా అసెంబ్లీలోనూ సంఖ్యా బలం పెంచుకోవాలనుకుంటున్నది. ఈ మేరకు ఖైరతాబాద్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఏ కడియం శ్రీహరి చేత శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించి తిరిగి ప్రజా తీర్పుకు వెళ్ళి అసెంబ్లీలో బలాన్ని పెంచుకోవాలనుకంటున్నట్లు సమాచారం.