ఫెడరేషన్ పేరు వాడితే న్యాయపరమైన చర్యలు

Facebook
X
LinkedIn

సోమయ్య నాన్ వర్కింగ్ జర్నలిస్ట్

సంఘాన్ని నడిపే అర్హత లేదు

హైదరాబాద్ :

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్లూజేఎఫ్) పేర శనివారం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో సమావేశం ఏర్పాటు చేసి వర్కింగ్ జర్నలిస్టులను మోసం చేసిన మామిడి సోమయ్య చర్యలను టీడబ్ల్యూజేఎఫ్ మహాసభల అడ్ హాక్ కమిటీ కన్వీనర్, సీనియర్ ఉపాధక్షులు పి రాంచందర్, ప్రధానకార్యదర్శి బి. బసవపున్నయ్య ఖండించారు. నాన్ వర్కింగ్ జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టుల పేర సమావేశం పెట్టడాన్ని తప్పుబట్టారు. ఫెడరేషన్ పేరు వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దొంగ సభ్యత్వం చేయడం, సభ్యత్వ రుసుం సొంత అవసరాలకు వాడుకోవడం, లెక్కలు చెప్పమంటే సంఘాన్ని చీల్చేందుకు ప్రయత్నించడాన్ని ఖండించారు. దొంగే.. దొంగా దొంగా ఉన్నట్టుగా సోమయ్య వ్యవహారం ఉందని వ్యాఖ్యానించారు. అసలైన ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈనెల 12న, విస్త్రృతస్థాయి సమావేశం ఈనెల 13న హైదరాబాద్లో ఇప్పటికే జరిగాయని అన్నారు. ఇందులో వందలాది మంది వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య, పులిపల్పుల ఆనందం, బండి విజయ్ కుమార్ , వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, కుడితూడి బాపూరావు రాష్ట్రవిస్తృత సమావేశం ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేస్తూ వారిని శాశ్వతంగా బహిష్కరించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.. వీరంతా నాన్వర్కింగ్ జర్నలిస్టులని అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్ పేరు వాడుకుంటే పోలీసు కేసుతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాజమాన్య కోటా లో ఉండే వీరంతా కలం కార్మికులు కాదని, జర్నలిస్టులు కానీ వాళ్లకు జర్నలిస్టు సంఘం పేర నీతులు ,చెప్పడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. మరోసారి ఫెడరేషన్ పేరు వాడితే సివిల్, క్రిమినల్ చర్యలకు మెనుకాడబోమని హెచ్చరించారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.