చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

Facebook
X
LinkedIn

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

           టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి  :

టీజీ ఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి బుధవారం కొండాపూర్, గొల్లపల్లి లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో పాటు అలియాబాద్ లో రూ 20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. గత పదేళ్ల లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు- రైతులకు ఒకే సారి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది – ఆరు గ్యారెంటీలలో బాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం తో పాటు 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, రూ 500 కే సిలిండర్ ను అందించడం జరుగుతుంది.- ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా ప్రతి ఇంటికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. కొనుగోలు కేంద్రాలలో ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.- రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.