జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సజ్జనార్ కీలక ఆదేశాలు..

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలీంగ్ దృష్ట్యా హైదరాబాద్ కమీషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.