కావేరీ బస్సు డ్రైవర్‌కి 14 రోజుల రిమాండ్‌కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌లోకి తరలింపు

Facebook
X
LinkedIn

కర్నూలు :

కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం సమీపంలో జరిగిన భయానక బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన కావేరీ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మిరియాల లక్ష్మయ్యను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపింది.

జిల్లా ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ కేసు విచారణ అధికారి పత్తికొండ డీఎస్‌పీ వెంకట్రామయ్య క్షుణ్ణంగా దర్యాప్తు జరిపినట్లు చెప్పారు. దర్యాప్తు అనంతరం డ్రైవర్‌ లక్ష్మయ్యను మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్‌పి పేర్కొన్నారు.

అక్టోబర్‌ 24 తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై చెట్లమల్లాపురం గ్రామ పరిధిలో బస్సు ప్రమాదం చోటుచేసుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు.