పోలీసులు, సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

పోలీసులు, సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేసారు.  గోరక్ష చేస్తున్న సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడం బాధాకరం అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఓట్లు, డబ్బుల కోసమో ప్రశాంత్ సింగ్ ఇలా చేశారని చెప్పడం సరికాదు అని అన్నారు. పోచారం కాల్పుల ఘటనలో గాయపడిన ఆయన్ను బండి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనూ గోవులకు, గో రక్షకులకు రక్షణ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే కొట్లాడుకుంటున్న పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రభుత్వం నిలబడుతుందా.. కూలుతుందా తెలియని పరిస్థితి నెలకొందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బండిసంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.