బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తి చెరువులోదూకి మృతి

Facebook
X
LinkedIn

అమరావతి :

కాకినాడజిల్లా తుని పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకు వచ్చి తాటిక నారాయణరావు(62) అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు మృతి చెందాడు. పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్తుండగా బహిర్భూమికి వెళ్తానని చెరువులో దూకాడు. తుని పట్టణ శివారులోని కోమటి చెరువు పక్కన పోలీసులు వాహనాన్ని ఆపారు. తదుపరి చెరువులో దూకినట్లు పోలీసులు తెలిపారు. తుని గ్రామీణ పోలీస్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన నిందితుడి అచూకీ కోసం గజ ఈతగాళ్లతో బుధవారం రాత్రి పోలీసులు వెతికారు. గురువారం ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా చెరువులో నిందితుడి మృతదేహం లభ్యం అయింది.