రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం

Facebook
X
LinkedIn

      త్వరలో నూతన లైఫ్ సైన్సెస్ పాలసీ: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ :

రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో నూతన లైఫ్ సైన్సెస్ పాలసీ తీసుకురాబోతున్నామని అన్నారు. శ్రీధర్ బాబు ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతుంది. మెల్ బోర్న్ లో ఆస్ బయోటెక్ సదస్సులో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. లైఫ్ సైన్సె స్ లో రాష్ట్రం సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికను రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్ రంగాన్ని రాబోయే ఐదేళ్లలో 250 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యం అని ఏడాదిన్నరలో రూ. 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలియజేశారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ లో భారత్ నుంచి హైదరాబాద్ కే స్థానం దక్కిందని కొనియాడారు. బయో డిజిటల్ కు కావాల్సినట్లు యువతను తీర్చిదిద్దుతున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.