భారత్ అన్ని మతాల సహజీవనం స్ఫూర్తి రాజీవ్ గాంధీ సద్బావన యాత్ర

Facebook
X
LinkedIn

                      కొనియాదిన సిఎం రేవంత్ రెడ్డి

  హైదరాబాద్ :

మన జాతి పిత మహాత్మ గాంధీ భారతదేశానికి పర్యాయపదం అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గాంధీ కుటుంబం కూడా దేశానికి అదే విధంగా స్ఫూర్తినిచ్చిందని అన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్బావన యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..గత 35 ఏళ్లుగా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర జరుగుతోందని, భారత్ లో అన్ని మతాల సహజీవనం స్ఫూర్తినిస్తుందని తెలియజేశారు. తమపై పోరాడిన మహాత్మాగాంధీని బ్రిటీషర్లు ఏమీ చేయలేకపోయారని, స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వ వాదులు గాంధీని పొట్టనపెట్టుకున్నారని, గాంధీని హత్య చేసిన వారు బ్రిటీషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులని తెలియజేశారు. దేశ సమగ్రత, సమైక్యత కాపాడడానికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అసువులు బాసారని, ఇందిరాగాంధీ వారసత్వం, త్యాగాలను దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పుణికిపుచ్చుకున్నారని ప్రశంసించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ కృషి చేశారని, మతసామరస్యం దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటపుడు సద్బావన యాత్ర చేశారని, దేశ సమగ్రతను కాపాడడానికి చివరకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని రేవంత్ రెడ్డి ప్రశంచారు.