పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అడ్డుపడుతున్నదెవరో తేలాలి

Facebook
X
LinkedIn

              డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

ఖమ్మం :

తొలిసారిగా సైంటిఫిక్ గా కులగణన నిర్వహించామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న పనులన్నీ బిసిలు చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూశామని, అఖిల పక్షాలను తీసుకెళ్లాలని బిజెపిని కోరుతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కూడా ముందుకు రావాలని కోరారు. కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొనాలని, బిల్లు పెడితే మద్దతిస్తామని తమ అగ్రనేతలంతా ఇప్పటికే స్పష్టం చేశారని తెలియజేశారు. బిసి రిజర్వేషన్ల బిల్లుకు అడ్డుపడుతున్న బిజెపికి వ్యతిరేకంగా అందరూ పాల్గొనాలని సూచించారు. పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అడ్డుపడుతున్నదెవరో తేలాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి సహా అందరం వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తామని అన్నారు. అఖిలపక్షంతో ప్రధాని నరేంద్ర మోడీని కలవాలనుకున్నామని, మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.