తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల విషయంలో దళారులు

Facebook
X
LinkedIn

టీటీడీ కార్యాలయాల్లోమంత్రులుప్రజాప్రతినిధుల పేషీల్లో పనిచేసే ఉన్నతాధికారులలా పరిచయం

                                  టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు

తిరుపతి :

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు సూచించారు. ఇటీవల కొందరు దళారులు, మధ్యవర్తులు శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసం చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ దళారుల్లో కొందరు టీటీడీ కార్యాలయాల్లో, మంత్రులు, ప్రజాప్రతినిధుల పేషీల్లో పనిచేసే ఉన్నతాధికారులలా పరిచయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం శ్రీవారి దర్శనం, వసతి కల్పిస్తామని ప్రలోభ పెడుతూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటనలు బయటకొచ్చాయని తెలిపారు.