గండిమైసమ్మ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నం

Facebook
X
LinkedIn

కుత్బుల్లాపూర్ :

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ గండిమైసమ్మ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గగిళ్లాపూర్ తండాకు చెందిన సిద్దూ(27) అనే యువకుడు తన భూమిని ఓ బడానిర్మాణ సంస్థకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారుల యత్నిస్తున్నారని ఆరోపణలు చేశాడు. తన భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఒ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. రెవెన్యూ అధికారులు 6లక్షలు రూపాయలు డిమాండ్ చేయడంతో యువకుడి మనస్తాపం చెందాడు. తన భూమి పత్రాలు పట్టుకుని ఎంఆర్ఒ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.