మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ

Facebook
X
LinkedIn

ఈ నెల 18తో దరఖాస్తుల స్వీకరణకు గడువు పూర్తి

ఇప్పటి వరకు తెలంగాణ అంతటా 5663 దరఖాస్తులు 

హైదరాబాద్ :

మద్యం షాపులకు రెండేళ్లకోసారి ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దీనితో తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మద్యం షాపులకు తెలంగాణ అంతటా దరఖాస్తుల జోష్ కొనసాగుతుంది. తెలంగాణ లోని 2620మద్యం షాపులకు నూతన అబ్కారీ విధానం ప్రకారం టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.  ఇప్పటి వరకు తెలంగాణ అంతటా 5663 దరఖాస్తులు  వచ్చాయి ఈ నెల 18తో దరఖాస్తుల స్వీకరణకు గడువు పూర్తవుతుంది.గత రెండేళ్ల క్రితం మద్యం షాపులకు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చివరి రెండు రోజుల్లో 45వేల నుంచి 50వేల దరఖాస్తులు వచ్చాయి.13నుంచి 18వరకు సాగే దరఖాస్తుల కు 14మినహా మిగతా తేదీల్లో ఆశజనక దరఖాస్తులు వస్తాయని అబ్కారీ అధికారులు పేర్కొంటున్నారు. చివరి మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్సైజ్ డివిజన్ల వారీగా, రంగారెడ్డి, హైదరాబాద్ డివిజన్లలోను, ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్ లు ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.అంతేగాక దరఖాస్తు దారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగ కుండా ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ పర్యవేక్షణ చేస్తున్నారు. గతంలో లాగా ఈ సారి కూడా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు లకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లకు గౌడ ఎస్సీ ఎస్టీ వ్యాపారాలు కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు గౌడ కులస్తులకు 671, ఎస్సీలకు 202, ఎస్టీ రిజర్వేషన్లు 84, జనరల్ లో4686 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అదిలాబాదులో 142, హైదరాబాదులో 746, కరీంనగర్లో 392, ఖమ్మంలో260, మహబూబ్నగర్లో 278, నల్గొండలో 568, నిజాంబాద్ లో 255, మెదక్లో411, రంగారెడ్డిలో 2353, వరంగల్ లో258 దరఖాస్తులు వచ్చాయి.