బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతం రావు
హైదరాబాద్ :
నారాయణపేట జిల్లా, మద్దూర్ మండల కేంద్రంలోని ఓ కంటి ఆసుపత్రి నిర్వాహకుడు రాసిన 17 పేజీల సూసైడ్ నోట్ స్థానికంగా భయాందోళనకు గురిచేసిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతం రావు అన్నారు. పార్టీ క్కార్యలయం ,లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ బాధితుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు ప్రకారం, దౌల్తాబాద్ మండలం బోడమర్రి తాండాకు చెందిన రమేశ్ నాయక్ గత నాలుగు రోజులుగా ఇంటికి రాకపోవడం, కుటుంబాన్ని తీవ్ర ఆందోళనలో ముంచిందన్నారు. ఈ దారుణ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా డీజీపీ కార్యాలయం సీరియస్‌గా తీసుకుని అన్ని సాక్ష్యాధారాలను సేకరించి తక్షణ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసారు. మద్దూర్ నివాసి వర్ధ్ రాంచంద్రయ్య సూసైడ్ నోట్ మరియు పాత్లవత్ రమేశ్ నాయక్ వివరాల ప్రకారం, ఈ ఘటనలో ఆత్మహత్యకు ప్రేరేపించడం, శారీరక హింస, మోసం, బ్లాక్‌మెయిల్, కిడ్నాప్, భయపెట్టడం, బలవంతపు మతమార్పిడి (లవ్ జిహాద్), ఎస్సి/ఎస్టి, దూషణలు, హవాలా/నకిలీ బంగారు నాణేల లావాదేవీలు వంటి తీవ్ర నేరపూర్వక చర్యలు చోటుచేసుకున్నాయన్నారు.ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా, ఆర్థిక మోసాలకు పాల్పడేలా ఉంది. కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా హత్యకేసు పరిధిలోకి తీసుకొని విచారణ చేపట్టాలని కోరుతున్నాం. అందుకే, కేసును పారదర్శకంగా, న్యాయపరంగా లోతైన దర్యాప్తు జరిపి, నిందితులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. సాక్ష్యాల సేకరణలో భాగంగా బాధితుల సూసైడ్ నోట్, కాల్ రికార్డులు, బాండ్ పేపర్లు, నకిలీ బంగారు నాణేలు వంటి అన్ని సాక్ష్యాలను సీజ్ చేసి, యథాతథంగా పరిశీలించాలని, 302/306 ఐపిసి (హత్య / ఆత్మహత్యకు ప్రేరేపించడం), 420, 384, 365, 323, 153A, 295Aఐపిసి, ఎస్సి/ఎస్టి చట్టాల కింద కూడా కేసు నమోదు చేయాలని, మతమార్పిడి ఒత్తిడి, హవాలా లేదా నకిలీ లావాదేవీలు జరిగితే, కేంద్ర, రాష్ట్ర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైతే ఉన్నతస్థాయి దర్యాప్తునకు సూచించాలని,బాధితుడు రమేశ్ నాయక్‌కు తక్షణ పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలి. భద్రతతో పాటు మానసిక- న్యాయ సహాయం అందించాలని,మద్దూర్ మండలంలో ఇదే రకమైన ఇతర బాధితులు ఉన్నట్లయితే, వారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని,ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, బాధితులకు తక్షణ న్యాయం చేయాలి. అన్ని ఇల్లీగల్ నెట్వర్క్‌లను వెలుగులోకి తీసుకుని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే నిందితులను అరెస్టు చేసి, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ మరియు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేసారు.