హైదరాబాద్ :
ఆమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ మరో అమాయకుడిని బలి తీసుకుంది. డల్లాస్‌లో నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఎల్బీ నగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో బిడిఎస్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. అయితే నేటి తెల్లవారుజామున దుండగుడి కాల్పుల్లో అతను కన్నుమూశాడు. కాల్పులకు పాల్పడింది ఓ నల్ల జాతీయుడని సమాచారం. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించాల్సి ఉంది.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.