ధర్మకర్తల సేవామండలి ” గా పేరు మార్చాలి

Facebook
X
LinkedIn

* ఆలయాలలో భక్తుల పట్ల సంస్కారవంతంగా వ్యవహరించాలి

* ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్

యాదగిరిగుట్ట :

దేవాలయాల పరిపాలన నిమిత్తం నియమించే ” ధర్మకర్తల మండలి ”  పేరును ఇకనుంచి ” ధర్మకర్తల సేవా మండలి ” గా పేరు మార్చాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్ ప్రభుత్వానికి సూచించారు. శనివారం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం …కొండ దిగువన ఉన్న లోటస్ టెంపుల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ మీడియాతో మాట్లాడుతూ .. ధర్మకర్తల పదవి తమ పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు కట్టబెడుతుంటారని.. ఈ పదవి దర్పానికి సంబంధించింది కాదని, సేవకు సంబంధించిందని ఆయన గుర్తు చేశారు. ఏ సందర్భంగా లోనైనా  ధర్మకర్తల్లో  బాసిజం ఉండరాదన్నారు. గుడులలో భక్తుల పట్ల మర్యాదగా, సంస్కారవంతంగా వ్యవహరించాలని కూడా ఆయన సూచించారు. పిల్లలు, యువత చెడిపోవడానికి వారి వారి తల్లిదండ్రుల పెంపకమే బాధ్యత అవుతుందన్నారు. భవిష్యత్తులో హిందూయిజం భద్రంగా ఉంటుందని , ఏలాంటి  డోకా లేదని..అయితే ఇతరులతో ఘర్షణ ఎప్పుడూ  ఉండేదేనన్నారు. దేవుడు ఒక్కడే రూపాలు వేరుగా ఉంటాయన్నారు.