శ్రామిక మహిళ మేడ్చల్ జిల్లా కన్వీనర్ ఎం.రేవతి కళ్యాణి
కీసర లో గోడపత్రిక ఆవిష్కరణ..
హైదరాబాద్ :
శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై అక్టోబర్ 5, 6న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ లో జరిగే రాష్ట్ర సదస్సులో చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారని శ్రామిక మహిళ మేడ్చల్ జిల్లా కన్వీనర్ ఎం.రేవతి కళ్యాణి తెలిపారు. శుక్రవారం కీసర లో అక్టోబర్ 5, 6న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్, వినయ్ గార్డెన్స్ లో తెలంగాణ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ రాష్ట్ర 5వ సదస్సు గోడపత్రికను శ్రామిక మహిళ మేడ్చల్ జిల్లా కన్వీనర్ ఎం.రేవతి కళ్యాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర నలుమూలల నుండి వందలాది మహిళా ఉద్యమ నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్నారు. సదస్సులో మహిళా శ్రామికులు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఉద్యోగ భద్రత సమస్యలపై చర్చలు జరుగుతాయి. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించబడుతుంది అన్నారు.
సదస్సు ముఖ్యాంశాలు..
మొదటి రోజు అక్టోబర్ 5న ఎస్ పి ఎం క్రికెట్ గ్రౌండ్ నుండి ఎస్ బి ఐ బ్యాంక్, రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభలో అఖిల భారత రాష్ట్ర కార్మిక నాయకుల ప్రసంగాలు ఉంటాయన్నారు.
సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆర్.త్రివేణి అధ్యక్షతన నిర్వహించే బహిరంగ సభలో సిఐటియు జాతీయ కార్యదర్శి
దీపా కె రాజన్, జాతీయ కోశాధికారి యం.సాయిబాబు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎస్.వి.రమ తదితరులు ప్రసంగిస్తారు.
రెండో రోజు.. ప్రతినిధులు సమగ్రంగా చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రతినిధులు,రాష్ట్ర నలుమూలల నుండి వందల మంది మహిళా నాయకులు, హాజరవుతున్నారని అన్నారు.