బీసీలు హక్కులు కోసం సాధన కోసం రాష్ట్ర ప్రజలంతా ఒక్కటి కావాలి

Facebook
X
LinkedIn

               మాజీ ఎంపీ వి. హనుమంతరావు పిలుపు

హైదరాబాద్ :

బీసీలు హక్కులు కోసం సాధన కోసం రాష్ట్ర ప్రజలంతా ఒక్కటి కావాలని అంత ఒక్కటి కావాలని, మాజీ ఎంపీ వి. హనుమంతరావు పిలుపునిచ్చారు. గాంధి భవన్ లో ఫిషరీష్ కార్పొరేటర్ చర్మెన్ మెట్టుసాయి కుమార్ తో కలిసి మాట్లాడారు.ఎన్నికలు రాకముందే రాహుల్ గాంధీ 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.దేశంలో గల బడుగు బలహీన వర్గాలు కోసం తెలుసు కున్నారన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల , జనగణన చేసి బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.కామారెడ్డి లో బహిరంగ సభలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది …సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి తో అమలు కూడా చేస్తున్నామన్నారు.బీసీలకు కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారు.. కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.రాష్ట్ర మంత్రి పొన్నం , టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు ప్రత్యేక కార్యాచరణ తో వెళ్తున్నారు.అసెంబ్లీ లో బీజేపీ , బిఆర్ఎస్ మద్దతు తెలుపుతాయి. బయట ధర్నాలు చేస్తాయి.అక్టోబర్ 8న హైకోర్టు లో విచారణ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా బయటకు రావాలన్నారు.గతం లో ఇచ్చిన 27% నే అమలు అవ్వడం లేదు.42 % కోసం బీసీలు బయటకు రాకపోతే భవిష్యత్తు లో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాదు.బీసీలు అంతా ఐక్యంగా ఉండాలి.రానున్న ఎన్నికల్లో బీసీల కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.ఈ అవకాశం ను బీసీలు సొంతం చేసుకోవాలి.స్థానిక ఎన్నికలు , విద్య , ఉద్యోగం అన్ని అంశాలు లో బీసీలు కు రిజర్వేషన్లు అమలు కావాలి.బీసీలు హక్కులు కోసం సాధన కోసం అంత ఒక్కటి కావాలి.