మందు బాబులకు అడ్డాగా మారిన జిహెచ్ఎంసి ఖాళీ స్థలం….

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

హెచ్ బి కాలనీ ప్రధాన రహదారిపై ప్రభుత్వ మీసేవ కార్యాలయంకు సమీపంలో ఉన్న జిహెచ్ఎంసి ఖాళీ స్థలం మందుబాబులకు అడ్డాగా మారింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఉదయం వేకువ జామున 6 గంటల నుంచి 9 గంటల వరకు మద్యం సేవించే వారు ఈ మధ్య ఈ మైదానంలో మద్యం తాగుతూ నానా హంగామా చేస్తారు. తెలుపు రంగు స్కూటర్పై ఓ వ్యక్తి వచ్చి ఇక్కడి వారికి మందును సరఫరా చేస్తూ ఉంటాడు. ఆదివారం ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయంలో మందు తాగిన వారి మధ్య గొడవ జరగడంతో అటుగా వెళుతున్న వాకర్స్ కు హెచ్ పి కాలనీ పేస్టు అధ్యక్షులు వెంకటాచారికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుషాయిగూడ పోలీసులు అక్కడకు వచ్చేసరికి మందుబాబులు పరారయ్యారు. మద్యం సేవించిన గ్లాసులు మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. ప్రతిరోజు ఇక్కడ ఇదే తతంగం నడుస్తుందని దీనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్థానికులు తెలిపారు. ఉదయం వేళల్లో వాకర్స్ కు, మహిళలకు, స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగజేస్తున్న ఈ అడ్డాలో అసాంఘిక పనులు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, జిహెచ్ఎంసి దీన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని హెచ్ బి కాలనీ ఫేస్ 2 అధ్యక్షులు వెంకటాచారి కోరారు. దీనిపై పూర్తి విచారణ జరుపుతామని, ఇక్కడ మద్యం సేవించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు.