బలహీనవర్గాల నోటికాడి ముద్ద లాగవద్దు

Facebook
X
LinkedIn

     రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ :

బలహీనవర్గాల నోటికాడి ముద్ద లాగవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీనవర్గాల నోటికాడి ముద్ద లాగవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తమ సంకల్పానికి ఎవరూ అడ్డుపడ వద్దని ఆయన కోరారు. పది శాతం ఇడబ్లుఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ గుర్తు చేశారు. బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్లకు ఎటువంటి నష్టం జరగదని అన్నారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల సర్వే నిర్వహించిందని ఆయన తెలిపారు. కుల గణన సర్వే ఆధారంగా ఎవరెంత ఉన్నారో తెలుసుకుని రిజర్వేషన్లు అమలు చేయడానికి సబ్ కమిటీ హైదరాబాద్‌ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సిఎం రేవంత్ వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదని, ఆ తర్వాత అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చించి అన్ని పార్టీల మద్దతు కూడగట్టామని అన్నారు. దానిని గవర్నర్‌కు పంపించడం జరిగిందని, గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపించడం జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఆమోదించిన బిల్లులు మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే ఆ తర్వాత వాటిని చట్టాలుగా అమలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. తమిళనాడులో అరవై శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. చట్టాలు, న్యాయాల పట్ల తమకు గౌరవం ఉందన్నారు. బిసిలకు ప్రభుత్వం అండగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.