మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు

Facebook
X
LinkedIn

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా :

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం తరపున జిల్లా వైద్య ఆరోగ్య, కో ఆపరేటివ్, పరిశ్రమలు, సమాచార శాఖల ఆధ్వర్యంలో అంబరాన్ని అంటే విధంగా బతకమ్మ సంబరాలు జరిగాయి. తీరొక్క పూలతో పెద్దగా బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో ఘనంగా బతుకమ్మను ఆడారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ, డిఎం అండ్ హెచ్ ఓ ఉమాగౌరీ, కో ఆపరేటివ్ అధికారి వెంకటరెడ్డి, సమాచార శాఖ అధికారులు నాగాంజలి, స్వర్ణలత సాంస్కృతిక కళాకారులు, మహిళ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.