కడవరకు కమ్యూనిస్టుగా నిలిచిన కామ్రేడ్ జయప్రకాష్

Facebook
X
LinkedIn

చర్లపల్లి ఈసీ నగర్ లో జరిగిన స్ఫూర్తి శాఖ సమావేశం లో నేతలు ఘన నివాళి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా :

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్, ప్రముఖ అభ్యుదయ రచయిత, విద్యావేత్త, సినియర్ కమ్యూనిస్టు పి జయ ప్రకాష్ కి ఈ సి నగర్ లో జరిగిన సిపిఎం స్ఫూర్తిశాఖ సమావేశం ఘన నివాళి తెలియజేసింది.
స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు జి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశం ఆయన మృతికి సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. సిపిఎం రాష్ట్ర నాయకులు డీజి నరసింహారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పి సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె చంద్రశేఖర్, కోమటి రవి, జి శ్రీనివాసులు జయప్రకాష్ అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించిన వారికి ధన్యవాదములు తెలిపారు.
ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి జె శ్రీమన్నారాయణ మాట్లాడుతూ జయప్రకాష్ వయసు 80 సంవత్సరాలు. జయ ప్రకాష్ ఈసీఐఎల్ లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారని. వివిధ విద్యాసంస్థల్లో విద్యార్థులకు బోధించి అనేకమంది పట్టభద్రులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈసీఐఎల్ లో ఉన్నప్పటినుండి అనేక వ్యాసాలు మరియు ప్రత్యేకంగా కార్మికుల కోసం విజ్ఞానం అందించడం కోసం ప్రతి నెల సైక్లో స్టైల్ పత్రికలు నడిపించారన్నారు. అది ఈసీఐఎల్ కార్మికుల్లో చైతన్య కలిగించడానికి ఎంతో దోహదపడింది. ప్రజాతంత్ర ఉద్యమంలో అన్ని సందర్భాలలో భాగస్వామ్యంలో అయ్యారు. చిన్నతనంలోనే పోలియో వ్యాధితో కాళ్లు చచ్చుపడినా మొక్కవోని ధైర్యంతో నిలిచి దాదాపు 60 సంవత్సరాలు పైగా ప్రజాతంత్ర ఉద్యమంలో పెనవేసుకుపోయారని తెలిపారు. జయ ప్రకాష్ ప్రజా ఉద్యమాలలో క్రియాశీలకంగా ఉండి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సభ్యుడుగా చివరి వరకు కొనసాగారని అన్నారు. జయప్రకాష్ ఇప్పటివరకు 100కు పైగా వ్యాసాల వరకు రాశారు. అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. చివరి వ్యాసం ఆయన మరణించిన రోజు తెలుగు నాడు దినపత్రికలో “విద్య కోసం లాంగ్ మార్చ్” ప్రచురితమైంది. జయప్రకాష్ భార్య అరవింద కుమారి రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు. వారు కూడా ప్రజాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. జయ ప్రకాష్ కుమార్తె తన తండ్రిని పసిపిల్లవాడి లాగా సేవలు చేసి ధన్యురాలు అయింది. స్ఫూర్తి గ్రూపు బాధ్యులు , జయరాజు, గుమ్మడి హరిప్రసాద్, శారద జయప్రకాష్ గారితో తమకున్న అనుబంధాన్ని