డిహెచ్  డైరెక్టర్ డా. రవీంద్ర నాయక్ పై అనుచిత వ్యాఖలు చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

Facebook
X
LinkedIn

                         తెలంగాణ ఎస్సి,ఎస్టి ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్

హైదరాబాద్ :

ఉదయ్ కాంత్ అనే లాయర్ గత 4 రోజుల క్రితం ఒక ఛానెల్ లో డిహెచ్  డైరెక్టర్ డా. రవీంద్ర నాయక్ గారిని దుర్భశలాడుతూ అవమాన పరుస్తూ మాట్లాడడాన్ని  తెలంగాణ ఎస్సి,ఎస్టి ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండించింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించటం మీడియా సమావేశం లో అధ్యక్షులు ప్రొఫెసర్ బాబురావు లైసెనింగ్ ఆఫీసర్ డా. అన్న ప్రసన్న ఉపాధ్యక్షులు డా. వెంకటేశ్వర్లు కోశాధికారి డా చీమ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా డా.  బాబురావు మాట్లాడుతూ దళిత డాక్టర్ అనే చులకన భావనతో అతను మాట్లాడటం ఎస్సి,ఎస్టి ల ఆత్మగౌరవం దెబ్బ తీసే విధంగా ఉందని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందిన్చ్జ్హి అతనిపై  తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. డిహెచ్ డైరెక్టర్ తప్పిదం లేకున్నా ఆ విధంగా దూషించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.డా. అన్న ప్రసన్న మాట్లాడుతూ ఉదయ్ కాంత్ మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడాడని వెంటనే మహిళ లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.డా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అతని పై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.డా చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంకొక సారి ఈ విధంగా ఎవరు మాట్లాడినా తగిన బుద్ధి చెప్పుతామని హెచ్చరించారు.