డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం  కోసం యువత ముందుకు రావాలి

Facebook
X
LinkedIn

  బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ పిలుపు

హైదరాబాద్ :

డ్రగ్ రహిత  సమాజ నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకుని నిర్వహించిన నషా ముక్త్  భారత్ 3 వ రన్  విజయవంతమైందని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం లో పార్టీ రాష్ట్ర ప్రదాన కార్య దర్శి గౌతం రావు తో కలిసి మాట్లాడారు.  డ్రగ్స్ రహిత సమాజం కోసం బలమైన భారతదేశం దృడమైన సంకల్పంతో ముందు సాగుతుందని అన్నారు. ఇందులో పాల్గొన్న పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రతిగా చేశారని తెలిపారు. డ్రగ్స్  కుదూరంగా ఉండాలని జీవితాలను నాశనం చేసుకోవద్దని గణేష్ సూచించారు. భారత్ కోసం పనిచేస్తు  నవభారత నిర్మాణంలో యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన పురస్కృతిని నాటి నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు సేవా పక్షం 15 రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గణేష్ తెలిపారు. అందులో భాగంగా 21న హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, ఎంపీలు ఈటేల రాజేందర్ , కొండా విశ్వర రెడ్డి ఎమ్మెల్యే పాయల్ శంకర్ , ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుళ్ళ వీరేశం గౌడ్  గారితో పాటు బిజెపి బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు