ప్రేమికులకు శుభవార్త

Facebook
X
LinkedIn

తల్లిదండ్రులను ఎదిరించలేక మృత్యువాత పడుతున్నప్రేమికులు దళిత కళ్యాణ వేదిక అండ

హైదరాబాద్ :

తల్లిదండ్రులను ఎదిరించలేక ఎంతోమంది ప్రేమికులు మృత్యువాత పడుతున్న నేటిm సమాజం లో  అలాంటివారి కోసం మేమున్నామంటూ దళిత కళ్యాణ వేదిక ధైర్యాన్ని నింపుతుంది 1991లో స్థాపించబడిన దళిత కళ్యాణ వేదిక నేటికీ ప్రేమికులకు కులాంతర వివాహాలకు 5764 వివాహాలు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా దగ్గరుండి వారికి అందేలా కృషి చేస్తుంది.ఈసందర్బంగా దళిత కళ్యాణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు దళితరత్న సేవారత్న రేణిగుంట్ల ఎల్లయ్య  మాట్లాడుతూ దళిత కళ్యాణ వేదిక ఆధ్వర్యంలో దేశాంతర కులాంతర మతాంతర వర్గాంతర అన్ని కులాల వారికి వివాహాలు జరిపిస్తున్నట్లు తెలిపారు ఇది కేవలం సమాజంలోని కుల నిర్మూలన అంటరానితనం కుల వివక్ష వరకట్న నిషేధం రూపుమాపుటకు మా వంతు కృషిగా స్థాపించబడినట్లు ఆయన తెలిపారు ఇప్పటివరకు 5764 వివాహాలు ప్రభుత్వ అధికారులు పెద్దల వివిధ సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు 18 సంవత్సరాలు నిండిన స్త్రీలు 21 సంవత్సరం నిండిన పురుషులకు మాత్రమే అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా తమ సంస్థ ద్వారా మళ్లీ పెళ్లి చేసుకోదలచుకున్న వారికి   చట్టరీత్యా విజాకులు పొందిన వారు మరియు అకాల మరణంతో చనిపోయిన భార్యను భర్తను కోల్పోయిన అభిలాష గల స్త్రీ పురుషులకు కూడా వివాహము ను చేయబడునని ఆయన తెలిపారు. అంతేకాకుండా దళితులను వివాహం చేసుకున్న వారికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారిచే రెండు లక్షల 50 వేల రూపాయలు, అలాగే దళితులను వివాహం చేసుకున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండు లక్షల 50వేల రూపాయలు ఉచితంగా ఇవ్వబడునని అన్ని కులాల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లక్ష 116 రూపాయలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.వివరాలకు 9391139770,9666987696,లేదా9177687977. నంబర్లను సంప్రదించాలని కోరారు.