రాజీవ్ పార్క్ అభివృద్ది కి 3 కోట్ల నిధులు మంజూరు చేయించిన జగ్గారెడ్డి, నిర్మల

Facebook
X
LinkedIn

* కన్సల్టెన్సీడిజైన్ అండ్ ఆర్కిటెక్ట్  ప్రతినిధులతో కలిసి  రాజీవ్ పార్క్ ను పరిశీలించిన జగ్గారెడ్డినిర్మల

* పదేళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్

* నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు  అందుబాటులో కి రాజీవ్ పార్క్

* వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్లీ  రాజీవ్ పార్క్   ప్రారంభోత్సవం

సంగా రెడ్డి :

అండ్  ఆర్కి టెక్ట్ , కన్సల్టేషన్ ప్రతినిధుల తో  రాజీవ్ పార్క్ ను  విజిట్ చేసిన జగ్గారెడ్డి , నిర్మల… ఈ అందర్బంగా జగ్గ రెడ్డి మాట్లాడుతూ  రాజీవ్ పార్క్ అభివృద్ది కి  3 కోట్లు మంజూరు అయ్యాయి….2004 ఎమ్మెల్యే అయిన తర్వాత 2005 లో బొబ్బిలి కుంట కు ఆనుకుని ఉన్న స్థలం లో రాజీవ్ పార్క్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని,ముఖ్యమంత్రులు  రాజశేఖర్ రెడ్డి , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల హయాం లో పనులు జరిగి పూర్తయ్యాయిన్నారు. సమైక్య రాష్ట్రం లో పదేళ్ల పాటు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఈ పార్క్ లో మ్యూజికల్ ఫౌంటేన్, చిల్డ్రన్ పార్క్, ప్లే ఏరియా ఏర్పాటు చేశాను.2014 నుండి 2018 వరకు పార్క్ కుంటుబడి పోయింది… చాలా మంది ఈ విషయం లో కాంప్లైంట్ చేసినప్పటికీ, ప్రభుత్వం మనది కాదు, ఎమ్మెల్యే గా లేను కాబట్టి ఏమి చేయలేకపోయాను…. నేను మొన్న ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్  ప్రభుత్వం ఉంది కాబట్టి నిధులు తీసుకువస్తున్ననన్నరు నియోజకవర్గం లో పనులు జరగడం కోసం  ప్రోటోకాల్ ఉండాలి  అందుకే  నిర్మల కు  కార్పొరేషన్ పదవి ఇస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఈమధ్య కాలంలో  మున్సిపల్ అడ్మనిస్టేషన్   డైరెక్టర్ అండ్ కమిషనర్  శ్రీదేవి  నీ కలిశాను…. ఆమెకు  రాజీవ్ పార్క్ కోసం  15 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది…. ఆమె అత్యవసర పనులు కోసం 3 కోట్లు ఇస్తా అనడం తో అందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగింది…3 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి… 3 కోట్ల తో ఏ ఏ పనులు చేయాలో కన్సల్టెంట్, అర్చిటెక్ట్ ప్రతినిధులకు సూచించిన జగ్గారెడ్డి…. పార్క్ లో పెరిగిన గడ్డి నీ తొలగించి లాండ్ స్కేప్ చేయండి…. ఉన్న చెట్ల ను తొలగించకుండా పనులు జరగాలన ఆదేశించారు.. కొత్త గ్రాస్, చిల్డ్రన్ పార్క్, లేటెస్ట్ గా ఏమి చేయొ చ్చో చూడండి…. కింద టైల్స్ కాకుండా , మందం ఉన్న తాండూర్ బండలు వేయండి. షో కోసం కాకుండా మన్నిక ఉండాలనీ , లైటింగ్ కూడా షో కోసం కాకుండా మన్నికైన వాం లైటింగ్ ఏర్పాటు చేయండి… పార్క్ లో ఎక్కువ వెలుతురు ఉండేలా హై మాస్ట్ లైట్స్, దగ్గర దగ్గర గా లైటింగ్ ఏర్పాటు చేయాలి…. ఓల్టేజ్ ఎక్కువ గా ఉన్న లైట్స్ వాడండి…. వర్షం నీరు పార్క్ లో నిలవకుండా ఉండాలి, వెంట వెంటనే బయటకు వెళ్ళాలి…. చిల్డ్రన్ పార్క్ లో  ఒక ఫీట్ మేర ఫైన్ సాండ్ ఏర్పాటు చేయాలి….  ఎంట్రెన్స్ లో రౌండ్ ఫౌంటేన్ ఉండాలి, అవి కూడా మన్నిక అయినవి , మంచి లేటెస్ట్ లైటింగ్ తో ఏర్పాటు చేయాలి…. మ్యూజికల్ ఫౌంటెన్ సైతం ఇప్పుడున్న లేటెస్ట్ డిజైన్ తో ఏర్పాటు చేయండి…..  జెంట్స్, లేడీస్ కు సెపరేట్ గా    6 వాష్ రూం లు ఏర్పాటు చేయండి…. రాజీవ్ పార్క్ చుట్టూ పది ఫీట్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి….. పార్క్ కు కొత్త    ఆర్చ్ ఏర్పాటు చేయండి…. కొత్త జిమ్ పరికరాలు ఏర్పాటు చేయండి, జిమ్ ఏర్పాటు చేసే దగ్గ ర పర్మినెంట్ ఫ్లోర్ ఏర్పాటు చేయాలి…. వాచ్మెన్ రూం ఏర్పాటు చేయండి… పార్క్ లో సేద తీరేందుకు లేటెస్ట్ స్టోన్ బెంచ్ ఏర్పాటు చేయండని చుచించారు.కొత్త గా 160 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాల నీ ఎలక్ట్రిసిటీ అధికారులకు సూచన… అక్టోబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వుంటుంది. ఆయన   చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తాం, అక్టోబర్ 25  లో గా పనులు పూర్తి కావాలి…. యుద్ద ప్రాతిపదికన పొద్దున, రాత్రి రెండు పూటలా పనులు జరగాలి…. ముఖ్యమంత్రి తో పాటు మంత్రి దామోదర్, ఇంచార్జ్ మంత్రి  వివేక్ లు హాజరవుతారు…. సంగారెడ్డి ప్రజలకు రాజీవ్ పార్క్ అందుబాటు లో లేక, సరైన సౌకర్యాలు లేక పది సంవత్సరాలు దాటి పోయింది…..  ప్రజలకు  అన్ని సౌకర్యాలతో   రాజీవ్ పార్క్   అందు బాటులో కి రావాలిపిల్లలు ఎంజాయ్ చేసేలా ఫౌంటేన్ ఉండాలి, సాయంత్రం 5 గంటల నుండి  10 గంటల వరకు ఫౌంటేన్ లు వర్క్ మోడ్ లో ఉండాలి….   పాత మ్యూజికల్ ఫౌంటెన్  స్థానం లో మొత్తం కొత్త గా ఏర్పాటు చేయండిపిల్లల కోసం కొత్త గా   మ్యాజిక్ పౌంటెన్ ఏర్పాటు చేయాలని కన్సల్టెంట్ ప్రతినిధుల కు సూచనఈనెల 30 న  అర్చిటెక్ట్స్ డిజైన్ ఫైనల్ చేసేందుకు హైదరాబాద్   లో కన్సల్టెంట్ ఆఫీస్ లో సమావేశం కావాలని నిర్ణయించారు.