సదాశివ పేట, సంగారెడ్డి మున్సిపాలిటీ లలో యాభై ఏళ్లకు సరిపడా పైప్ లైన్ల నిర్మాణం

Facebook
X
LinkedIn

మున్సిపల్, పబ్లిక్ హెల్త్, అర్ డబ్ల్యు ఎస్, ఇరిగేషన్ అధికారుల తో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్ష

సంగారెడ్డి :

సంగారెడ్డి, సదాశివ పేట మున్సిపాలిటీ ల పై  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, అర్ డబ్ల్యు ఎస్, ఇరిగేషన్ అధికారుల తో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. సదాశివ పేట, సంగారెడ్డి మున్సిపాలిటీ లలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా వస్తున్నాయి, నీటి నాణ్యత లేదనే ఫిర్యాదులు ఉన్నాయనీ అధికారులకు జగ్గారెడ్డి వివరించారు.ఈ సందర్బంగా సంగారెడ్డి , సదాశివపేట  రెండు మున్సిపాలిటీ లలో కొత్త కాలనీల కు అవసరమైన పైప్ లైన్లు పై వివరాలు రెడీ చేయండని అధికారులకు సూచించారు. మంజీరా వాటర్ స్కీమ్ లో భాగంగా  సదాశివపేట మున్సిపాలిటీ కి ఒక ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్ తో పాటు నాణ్యత గల పైప్ లైన్ లు ఏర్పాటు అలాగే … సంగారెడ్డి మున్సి పాలిటి కి అదనంగా ఫిల్టర్ బెడ్, ఇంటెక్ వెల్ ఏర్పాటు చేయాలన్నారు. గతం లో సంగారెడ్డి మున్సిపాలిటీ లో నాలుగు వార్డులకు కలిపి ఒక ట్యాంక్ చొప్పున ఏర్పాటు చేశామని జగ్గారెడ్డి తెలిపారు….. ఇప్పుడు కూడా పెరిగిన కాలనీ లకు సరిపడా ట్యాంక్ ల ఏర్పాటు కు ప్రాజెక్ట్ లో ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు.  యాభై ఏళ్లకు సరిపడా పైప్ లైన్ల నిర్మాణం ఉండాలని,. వచ్చే నెల 15 వ తేదీ లోపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది, ఈ విషయం పై దామోదర్ రాజనర్సింహ తో సైతం మాట్లాడానన్నారు….. ఈనెల 30 వరకు మంజీరా సరఫరా కు సంబంధించి   కన్సల్టెన్సీ ప్రతినిధులు పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలనీ, నేను నిర్మలా కలిసి ఈ ఎన్ సి నీ కలిసి  ప్రాజెక్ట్ రిపోర్ట్  సబ్ మీట్ చేస్తామన్నారు.  కొత్త కాలనీలకు సరిపడా నీరు అందించేందుకు    అవసరమైన ట్యాంక్ ల నిర్మాణం చేయాలని ఆదేశించారు. అడ్జెస్ట్ మెంట్ మైండ్ తో , తాత్కాలిక ప్రతిపాదనలు తయారు చేయద్దు.  రానున్న యాభై ఏళ్లకు సరి పడేలా డిజైన్ సిద్దం చేయండి. సీఎం దగ్గర నుండి నిధులు తెస్తా, ప్రతిపాదనల విషయం లో అధికారులు కాంప్రమైజ్ కావద్దు అన్న జగ్గారెడ్డి ప్వేర్కొన్నారు.ఈ రెండు మున్సిపాలిటీ  లకు మిషన్ భగీరథ నుండి కాకుండా, డైరెక్ట్ గా మంజీరా నీరు సరఫరా కావాలి,ఇదే నా టార్గెట్… ఏక కాలంలో రెండు గంటల పాటు మున్సిపాలిటీ మొత్తానికి మంజీరా నీరు రావాలి…… సదాశివపేట మున్సిపాలిటీ లో ఇప్పుడున్న జనాభా కు అదనంగా మరో యాభై వేల జనాభా కు సరిపడా ట్యాంక్ ల నిర్మాణం జరగాలని అన్నారు. రానున్న రెండు సంవత్సరాల లో  ఈ రెండు మున్సిపాలిటీ లకు మంజీరా నీటి సరఫరా ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నదే నా ఉద్దేశ్యమని, సదాశివ పేట మున్సిపాలిటీ కి   డైరెక్ట్ గా సింగూర్ ప్రాజెక్ట్ నుండే 25 ఎం ఎల్ డి నీటి నీ తీసుకునేలా ఇరిగేషన్ ఈ ఎన్ సి కి, మున్సిపల్  సెక్రటరీ కి, ఇరిగేషన్ మంత్రి కి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.అలాగే  సంగారెడ్డి మున్సిపాలిటీ కి భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా 50 ఎం ఎల్ డి నీటి నీ మంజీరా బ్యారేజ్ నుండి తీసుకునేందుకు సంభదిత ఉన్నతాధికారుల కు , మంత్రి కి లెటర్ లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు…… సదాశివ పేట మున్సిపాలిటీ కి ప్రస్తుతం రోజు కు గంటన్నర నీరు సరఫరా చేయాలంటే ఏం చేయాలి? అని అధికారులకు ప్రశ్నించారు. తాళ్ళపల్లి లోని 10 ఎం ఎల్ డి ఫిల్టర్ బెడ్ నుండి సంగారెడ్డి మున్సిపాలిటీ కి   ప్రత్యేక లైన్ వేసి సరఫరా చేస్తే , ఇక్కడి కేటాయింపుల నుండి  సదాశివపేట మున్సిపాలిటీ కి నీటి సరఫరా అడ్జెస్ట్ చేయొచ్చని అధికారులు జగ్గారెడ్డి కి తెలిపారు.  అందుకోసం 10 కోట్లు కావాలని అధికారులు అడిగారు.ఈ సందర్బంగా సంగారెడ్డి నియోజకవర్గం లో నీటి సరఫరా కు ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు,  వినియోగం లో లేని  ఓవర్ హెడ్ ట్యాంక్ లను పునరుద్ధరించేందుకు మరొక 5 కోట్ల నిధుల కోసం మంత్రి సీతక్క కు లెటర్ రాయాలని  సమావేశం లో నిర్ణయించేరు…తాళ్ళపల్లి  ఫిల్టర్ బెడ్ నుండి ప్రత్యేక లైన్ వేస్తే సంగారెడ్డి, కంది మండలాల్లోని 54 గ్రామాలకు మంజీరా నీటి సరఫరా చేయడం తో పాటు, సదాశివ పేట మున్సిపాలిటీ కి నీటి నీ అడ్జెస్ట్ చేయొచ్చునని,….  తాళ్ళపల్లి  నుండి  పైప్ లై న్ నిర్మాణానికి సంబంధించిన నిధుల కోసం మంత్రి సీతక్క కు లెటర్ ఇవ్వాలని …. సంగారెడ్డి , కంది మండలాల్లో నీ 18 తండాల్లో నీటి సరఫరా కు ఉన్న ఇబ్బందులు, సమస్యలపై సర్వే చేయాలని అధికారులను ఆదేసహించారు. సంగారెడ్డి నియోజకవర్గం లోని  నాలుగు మండలాలకు సంబంధించి గ్రామాల్లో , తాండాల్లో , కొత్త కాలనీల్లో    అవసరమైన చోట ట్యాంక్ ల నిర్మాణానికి  అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు చారు….. సీఎం తో పాటు మున్సిపల్ ఈఎన్సి కి లెటర్ ఇవ్వాలని,…రాజం పేట నుండి  హాస్టల్ గడ్డ ఈద్గా వరకు రోడ్ నిర్మాణం కు , ఫిల్టర్ బెడ్ లో సి సి రోడ్డు నిర్మాణానికి   దసరా తర్వాత శంకుస్థాన జరగాలి, వెంటనే పనులు ప్రారంభం కావాలనీ అధికారులకు జగ్గారెడ్డి ఆదేశించారు.