ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్ర స్థాయిలో హెచ్చరిక
న్యూ డిల్లీ :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వాణిజ్య చర్చలపై భారత్ ఏదోఒక సమయంలో దిగిరావాల్సిందేనని వ్యాఖ్యానించారు. లేదంటే ఢిల్లీకి మంచి ముగింపు ఉండదంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. న్యూస్‌ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో మాట్లాడుతూ.. అమెరికాపై ప్రపంచంలోని ఏ దేశం వేయని టారిఫ్‌లు భారత్ వసూలుచేస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించకముందు మాస్కో నుంచి భారత్ తక్కువగానే చమురు ( కొనుగోలు చేసేదని.. యుద్ధం తర్వాత పెద్దమొత్తంలో లాభం పొందేందుకు ఎక్కువగా కొనుగోలు చేస్తోందన్నారు. భారత్ వీలైనంత తొందరగా అమెరికాతో ఒప్పందం చేసుకుంటే మంచిదని నవారో వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి దేశాలు అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాల కుదుర్చుకున్నాయని గుర్తుచేశారు. రష్యా, చైనాలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే భారత్‌కు మంచి ముగింపు ఉండదంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.