డ్రైవర్‌కు గుండెపోటు..స్టీరింగ్‌ కో డ్రైవర్‌కు ఇచ్చి బస్సులోనే ప్రాణాలు వదిలాడు

Facebook
X
LinkedIn

ఇండోర్‌ :

ఇండోర్‌ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్‌ సమయంలో డ్రైవర్‌కు గుండెపోటు రావడం తో  ముందు జాగ్రత్తగా స్టీరింగ్‌ కో డ్రైవర్‌కు ఇచ్చి ప్రయాణికులను కాపాడాడు. అనంతరం బస్సులోనే ప్రాణాలు వదిలాడు.వివరాల్లోకి వెళితే.. సతీశ్‌ రావు అనే వ్యక్తి ఇండోర్‌ నుంచి జోధ్‌పూర్‌ వెళ్లే ప్రైవేట్‌ బస్సును   నడుపుతున్నాడు. అయితే, మార్గం మధ్యలో గుండెపోటు గురయ్యాడు. దీంతో ముందు జాగ్రత్తగా కో డ్రైవర్‌ను డ్రైవింగ్‌ చేయమని చెప్పాడు. డ్రైవింగ్‌ సీట్‌లో నుంచి పక్కకు జరిగి కూర్చున్నాడు. ఇంతలో హెల్పర్‌ సమీపంలోని మెడికల్‌ స్టోర్‌ వద్దకు వెళ్లగా.. అది మూసివేసి ఉంది. వేరేచోటుకు వెళ్తున్న క్రమంలోనే సతీశ్‌ రావు కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బస్సులోని వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, చివరి నిమిషంలో స్టీరింగ్‌ హెల్పర్‌కు ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సేఫ్‌గా ఉన్నారు. అయితే, అతడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.