న్యూ డిల్లీ ;
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం యాన్యువల్ లీగల్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. రాహుల్ ప్రసంగం సభలో ఆయన మద్దతుదారులు నినదించారు. ‘ఇస్ దేశ్ కా రాజా కైసా హో.. రాహుల్ గాంధీ జైసా హో’ అని పలువురు నినదించగా దానికి రాహుల్ గాంధీ స్పందిస్తూ.. తాను రాజును కాదని.. కావాలని అనుకోవడం లేదన్నారు. అయినా పలువురు అలాగే నినాదాలు చేశారు. తాను రాజుగా మారాలని కూడా కోరుకోవడం లేదని.. తాను రాజును వ్యతిరేకిస్తున్నానని..
నేను ఆ భావనకు కూడా వ్యతిరేకినన్నారు. రాహుల్ గాంధీ గతంలో ప్రధానిని ఉద్దేశించి ‘రాజు’గా అభివర్ణిస్తూ ప్రజల గొంతుక వినడం లేదంటూ ఆరోపించారు