గోవా గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌మాణ స్వీకారం అశోక్ గ‌జ‌ప‌తి రాజు

Facebook
X
LinkedIn

ప‌నాజీ :

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు గోవా గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు. పీఎస్ శ్రీధ‌ర‌న్ పిళ్లై స్థానంలో ఆయ‌న ఆ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో బాంబే హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ అలోక్ ఆరాధే .. ఆయ‌న చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్‌తో పాటు ఇత‌ర అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఉద‌యం 11.30 నిమిషాల‌కు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది.