ఇండియ‌న్ టెకీల‌ను తీసుకోవ‌ద్దు.. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ ఆదేశాలు !

Facebook
X
LinkedIn

న్యూఢిల్లీ :

గూగుల్‌, మైక్రోసాఫ్ట్ లాంటి మేటి టెకీ కంపెనీల‌కు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. విదేశీ ఉద్యోగుల‌ను తీసుకోవ‌డం ఆపేయాల‌న్నారు. ముఖ్యంగా ఇండియా లాంటి దేశం నుంచి టెకీల‌ను రిక్రూట్ చేసుకోవ‌ద్దు అన్నారు. వాషింగ్ట‌న్‌లో జ‌రిగిన ఏఐ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు. అమెరికా కంపెనీలు స్వ‌దేశంలో ఉద్యోగాలు క్రియేట్ చేయ‌డంపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. చైనాలో ఫాక్ట‌రీలు నిర్మించ‌డం కానీ, భార‌తీయ టెకీ ఉద్యోగుల‌ను రిక్రూట్ చేయ‌డం లాంటివి వ‌ద్ద‌న్నారు. టెకీ కంపెనీలు ప్ర‌ద‌ర్శిస్తున్న గ్లోబ‌ల్ మైండ్‌సెట్‌ను ఆయ‌న విమ‌ర్శించారు. ఇలాంటి విధానం వ‌ల్ల అనేక మంది అమెరిక‌న్లు ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు చెప్పారు. అమెరికా స్వేచ్ఛ‌ను వాడుకుని కొన్ని టాప్ టెక్ కంపెనీలు అధిక లాభాలు గ‌డించిన‌ట్లు తెలిపారు. ఆ కంపెనీలు విదేశాల్లో ఎక్కువ‌గా పెట్టుబ‌డి పెట్టాయ‌న్నారు. ట్రంప్ అధ్య‌క్ష హ‌యంలో ఇక రోజులు ఉండ‌వ‌ని ఆయ‌న అన్నారు.