తెలుగునాడు, హైదరాబాద్ :
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బహుభాషా కోవిదుడు, రచయిత, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహా రావు గారు దేశానికి అందించిన అమూల్యమైన సేవలను, భారతావనిని ప్రగతిపథంలో నడిపించడంలో ఆయన పాత్రను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జూబ్లీ హిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో పీవీ చిత్రపటానికి నివాళులు అర్పించిన వారిలో సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, మట్టా రాగమయి , టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.