ఇరాన్ :
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అమెరికా, ఇజ్రాయెల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమపై దాడి చేసిన వారికి కఠినమైన, నిర్ణయాత్మకమైన శిక్ష ఉంటుందని హెచ్చరించారు. అమెరికా దాడుల తర్వాత ఖమేనీ తొలిసారి స్పందించారు. శత్రువులు కఠినమైన శిక్షణు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘దాడులు కొనసాగుతాయి. శత్రువు భారీ తప్పు చేసింది. పెద్ద నేరానికి పాల్పడింది. శిక్షించాల్సిందే. ఇప్పటికే శిక్ష మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు కఠినమైన, నిర్ణయాత్మకమైన ప్రతిస్పందన ఉంటుంది’ అని ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.