సింగర్ మంగ్లీ జన్మదిన వేడుకలలో  విదేశీ మద్యం, గంజాయి లభ్యం

Facebook
X
LinkedIn

చేవెళ్ల జూన్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );:

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సింగర్ మంగ్లీ జన్మదిన వేడుకలలో    విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. మంగ్లీ బర్త్ డే పార్టీ సందర్భంగా ఈర్లపల్లిలో రిసార్టులో స్నేహితులకు మంగళవారం ఆమె పార్టీ ఇచ్చారు. రిసార్టుపై పోలీసులు దాడులు చేయడంతో విదేశీ మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు దొరికాయి. మంగ్లీ, రిసార్టు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ మద్యం, గంజాయి ఎక్కడ నుంచి సరఫరా చేశారు అనే కోణంలో విచారిస్తున్నారు.