స్మగ్లర్ పాత్రకు గద్దర్ అవార్డులా..? ప్రకటించిన గద్దర్ అవార్డులను రద్దు చేయాలి

Facebook
X
LinkedIn

తెలుగునాడు సమితి

తెలుగునాడు, హైదరాబాద్ :

స్మగ్లర్ పాత్రకు గద్దర్ అవార్డు ఇవ్వడం గద్దర్ ఆశయాలకే అవమానకరం. అత్యంత విరుద్ధంగా ప్రజా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఈ గద్దర్ అవార్డులు ఇచ్చారని తెలుగునాడు సమితి విమర్శించింది.
ఈ అవార్డులు
లౌకిక ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉన్నాయని అందువల్ల వాటిని రద్దు చేయాలని తెలుగునాడు సమితి అధ్యక్షులు జి హరిప్రసాద్, కార్యదర్శి ఎం రాంబాబు పేర్కొన్నారు.
ఎంతో కాలం గా ఎదురుచూస్తున్న తెలంగాణ గద్దర్ అవార్డులు ఈరోజు ప్రకటించడం ప్రకటించిన తీరు యావత్ తెలంగాణ కళా హృదయాలను కలచి వేసింది అని అన్నారు. ఈ అవార్డుల ద్వారా తెలంగాణ సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. సందేశాత్మకంగా ఉన్న కళారూపాలను ఆదరించాలి, అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. అంతేకానీ ఈ విధంగా యువతను పెడదారి పెట్టించే స్మగ్లర్ పాత్రలని ప్రోత్సహించడం సరైంది కాదని విమర్శించారు.

ఈ అవార్డులు తెలంగాణ సమాజాన్ని కించపరచేలా ఇది అత్యంత దుర్మార్గం అని, తెలంగాణ ప్రజాధనంను వృధా చేస్తారన్నారని తెలుగునాడు సమితి విమర్శించింది.

ఉత్తమ చిత్రంగా కల్కి సినిమాకు, రెండవ చిత్రం పోటేలు సినిమా, మూడవ చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు ఇచ్చారు. ఉత్తమ హెరిటేజ్ సినిమాగా రజాకార్ సినిమాకి ఇచ్చారు.

ఉత్తమ దర్శకుడు కల్కి సినిమా ఇవ్వడం అంటే కల్కి సినిమా గాని రజాకార్ సినిమా గాని మతతత్వ సినిమాలు చరిత్రను వక్రీకరించిన సినిమాలు. మత ఉన్మాదాన్ని ప్రేరేపించిన సినిమాలు ఇటువంటి సినిమాలకు గద్దర్ అవార్డ్స్ పేరుతో గద్దర్ ను అవమానించడం తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడంమే అని తెలుగు నాడు సమితి అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు.