లాప్రోస్కోపిక్ అరుదైన శాస్త్ర చికిత్స ద్వారా
అభినందనలు తెలిపిన తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ తమ్మాలి రామకృష్ణ
నటభూషణ శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన అరుదైన ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు ను బ్రేక్ చేశారు.
తెలుగునాడు, హైదరాబాద్ :
తెలుగు చిత్రసీమలో నటభూషణుడిగా ప్రసిద్ధిచెందిన శోభన్ బాబు మనవడు, డాక్టర్ సురక్షిత్ బత్తిన, వైద్యరంగంలో అసాధారణమైన ఘనత సాధించారు. ఆయన ఇటీవల చెన్నైలో ట్రూ 3D లాప్రోస్కోపిక్ పద్ధతిలో 4.5 కిలోల బరువు గల భారీ గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాయిని అధిగమించారు.
2019లో డాక్టర్ రాకేష్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని లాప్రోస్కోపిక్ విధానంలో తొలగించి ఆ రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు అదే పద్ధతిలో డాక్టర్ సురక్షిత్ అతికష్టం మీద ఆ మైలురాయిని అధిగమించారు. ఈ అరుదైన ఆపరేషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతిపాదనకు సమర్పించబడి అధికారికంగా త్వరలోనే ప్రకటన వెలువడనుంది.
ఈ విజయాన్ని పురస్కరించుకొని శోభన్ బాబు అభిమానులు, తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి మరియు ఇతర రాష్ట్రాల అభిమానులు డాక్టర్ సురక్షిత్ కు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సురక్షిత్ మాట్లాడుతూ, “ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలలో మా గురువు డాక్టర్ రాకేష్ సిన్హా ప్రేరణ నాకు మార్గదర్శకమైంది. ఈ సాహసం చేయడానికి ఆయన స్ఫూర్తి ఇచ్చారు” అన్నారు. ఆయన తన కెరీర్‌లో ఇప్పటివరకు 10,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు నిర్వహించామని, ఎన్నో క్లిష్టమైన కేసులను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.
2016లో చెన్నైలో ప్రారంభించిన ఇండిగో ఉమెన్స్ సెంటర్ ద్వారా ఆయన నూతన వైద్యపద్ధతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ట్రూ 3D లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అధునాతన చికిత్సలను అందిస్తూ ఎందరో మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం అందిస్తున్నారు.